Submit A Query

Hyderabad  
040-67313131

Secunderabad  
040-69097676

Visakhapatnam  
0891-6763333

Siliguri  
0353-3501000

Chennai  
044-69656767

aniversary_logo

Victory over Prostate Cancer through Awareness

  • A chance of affecting one in every seven men
  • Early detection leads to complete cure and quality life
  • Small tests are necessary after 50 years of age
  • Senior Doctor Srinivas from AINU, Dilsukhnagar

Senior Consultant Urologist Dr. N. Srinivas from the Asian Institute of Nephrology and Urology (AINU), Dilsukhnagar facility, emphasized that everyone should be aware of prostate cancer, which has a one in seven chance of affecting men. In the context of marking September as Prostate Cancer Awareness Month and creating awareness among the public, an awareness walk was organized on Sunday by the AINU Dilsukhnagar branch. Doctors, staff, and several past patients who were treated for this condition at AINU actively participated in the event.

Speaking on the occasion, Dr. Srinivas said, "Prostate cancer is the second most common cancer after lung cancer in India. One in seven men is affected by it, but the symptoms don’t show up initially. It spreads silently like water under the carpet. Most men do not even realize they have it until it reaches the fourth stage. Awareness about this dangerous disease among men is very low. Therefore, September is recognized globally as Prostate Cancer Awareness Month to spread awareness. Usually, prostate cancer does not reveal any symptoms until it spreads throughout the body. The best way to combat it is through early tests. All men over the age of 50 should undergo two simple tests every year: Prostate-Specific Antigen (PSA) and Digital Rectal Examination (DRE). These can help detect the disease in its early stages. Particularly, men with a family history of prostate cancer or urinary problems should definitely consult a urologist and get tested for prostate cancer," he advised.

Senior Urologist Dr. Subhash Chandra Bose, Female Urologist Dr. Deepti, Nephrologist Dr. Vali, Anesthesiologists Snigdha, Ramakrishna, Raghunath, Salman, AINU Dilsukhnagar staff, and several past patients participated in the awareness walk with enthusiasm.

అవ‌గాహ‌న‌తోనే ప్రోస్టేట్ క్యాన్స‌ర్‌పై విజ‌యం

  • ప్ర‌తి ఏడుగురు పురుషుల్లో ఒక‌రికి వ‌చ్చే అవ‌కాశం
  • ముందుగా గుర్తిస్తే పూర్తిగా న‌య‌మై.. నాణ్య‌మైన జీవితం
  • 50 ఏళ్ల త‌ర్వాత చిన్న చిన్న ప‌రీక్ష‌లు అవ‌స‌రం
  • దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ఏఐఎన్‌యూ సీనియర్ డాక్ట‌ర్ శ్రీ‌నివాస్‌

ప్ర‌తి ఏడుగురు పురుషుల్లో ఒక‌రికి వచ్చే అవ‌కాశం ఉన్న ప్రోస్టేట్ క్యాన్స‌ర్ విష‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ అవ‌గాహ‌న క‌ల్పించుకోవాల‌ని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) దిల్‌సుఖ్‌న‌గ‌ర్ ఫెసిలిటీ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ యూరాల‌జిస్ట్ డాక్ట‌ర్ ఎన్‌. శ్రీ‌నివాస్ తెలిపారు. సెప్టెంబ‌రు నెల‌ను ప్రోస్టేట్ క్యాన్స‌ర్ అవ‌గాహ‌న మాసంగా గుర్తించి.. దీనిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించేందుకు కృషిచేస్తున్న నేప‌థ్యంలో ఆదివారం ఏఐఎన్‌యూ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ శాఖ ఆధ్వ‌ర్యంలో ఒక అవ‌గాహ‌న న‌డ‌క కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఇందులో ఏఐఎన్‌యూ వైద్యులు, సిబ్బందితో పాటు.. గ‌తంలో ఇక్క‌డ ఈ వ్యాధికి చికిత్స చేయించుకున్న ప‌లువురు రోగులు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ మాట్లాడుతూ, “భార‌త‌దేశంలో ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ త‌ర్వాత అత్యంత ఎక్కువ‌గా వ‌చ్చేది ప్రోస్టేట్ క్యాన్స‌రే. ప్ర‌తి ఏడుగురు పురుషుల్లో ఒక‌రు దీని బారిన ప‌డుతున్నారు. కానీ, దీనికి ఎలాంటి ల‌క్ష‌ణాలూ బ‌య‌ట‌ప‌డ‌వు. చాప‌కింద నీరులా వ్యాపిస్తుంది. దాదాపు నాలుగోద‌శ‌కు వ‌చ్చేవ‌ర‌కు అస‌లు ఇది ఉంద‌న్న విష‌య‌మే చాలావ‌ర‌కు తెలియ‌దు. ఇంత ప్ర‌మాద‌క‌ర‌మైన ఈ వ్యాధి గురించి పురుషుల్లో అవ‌గాహ‌న చాలా త‌క్కువ‌. అందువ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్స‌ర్ గురించి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సెప్టెంబ‌ర్ నెల‌ను ప్రోస్టేట్ క్యాన్స‌ర్ అవ‌గాహ‌న మాసంగా గుర్తించారు. సాధార‌ణంగా ప్రోస్టేట్ క్యాన్స‌ర్ అనేది శ‌రీర‌మంతా విస్త‌రించేవ‌ర‌కూ దాని ల‌క్ష‌ణాలు ఏవీ అంత త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వు. అందువ‌ల్ల ముంద‌స్తు ప‌రీక్ష‌లు చేయించుకోవ‌డ‌మే త‌రుణోపాయం. 50 ఏళ్లు దాటిన పురుషులంద‌రూ ప్ర‌తి సంవ‌త్స‌రం ఒక‌సారి ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ (పీఎస్ఏ), డిజిట‌ల్ రెక్ట‌ల్‌ ఎగ్జామినేష‌న్ (డీఆర్ఈ) అనే రెండు సాధార‌ణ ప‌రీక్ష‌లు చేయించుకుంటే ఈ వ్యాధిని ప్రాథ‌మిక ద‌శ‌లోనే గుర్తించ‌వ‌చ్చు. ముఖ్యంగా కుటుంబంలో ఎవ‌రికైనా ఇంత‌కుముందు ప్రోస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చినా, లేదా మూత్ర‌విస‌ర్జ‌న‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ఏవైనా వ‌చ్చినా త‌ప్ప‌నిస‌రిగా ఒక యూరాల‌జిస్టును సంప్ర‌దించి, ప్రోస్టేట్ క్యాన్స‌ర్ ప‌రీక్ష‌లు చేయించుకోవాలి” అని తెలిపారు.

ఈ అవ‌గాహ‌న న‌డ‌క కార్య‌క్ర‌మంలో సీనియ‌ర్ యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సుభాష్‌చంద్ర‌బోస్‌, మ‌హిళా యూరాల‌జిస్టు డాక్ట‌ర్ దీప్తి, నెఫ్రాల‌జిస్టు డాక్ట‌ర్ వ‌లీ, ఎనస్థీషియ‌న్లు స్నిగ్ధ‌, రామ‌కృష్ణ‌, ర‌ఘునాథ్‌, స‌ల్మాన్, ఏఐఎన్‌యూ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ సిబ్బంది, ప‌లువురు పాత పేషెంట్లు త‌దిత‌రులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Gallery