Book an Appointment

Hyderabad  
040-67313131

Secunderabad  
040-69097676

Visakhapatnam  
0891-6763333

Siliguri  
0353-3501000

Chennai  
044-69656767

aniversary_logo

AINU Doctors Use Robotics to Repair Decades-Old Bladder Leak Caused by Normal Delivery 35 Years Ago

In a landmark achievement in the field of urology, doctors at the Asian Institute of Nephrology and Urology (AINU) successfully closed the large bladder fistula using the world's most advanced Da Vinci robotic surgical system, providing immense relief to the patient. Dr. S. M. Ghouse, Sr Consultant - UroOncology and Robotic Urology, AINU shared details of this groundbreaking procedure. Dr Sarika Pandya, Sr. Consultant - Female Urology, AINU, took part in the procedure.

A 56-year-old woman from Anantapur district had been suffering from this issue for the past 35 years. During a normal delivery back then, she developed a large fistula in her bladder, measuring about five to six centimeters in length. Due to this fistula, she was unable to control her urine, which constantly leaked. She managed to get by all these years using diapers or some cloth to absorb the leakage. Recently, she came to the hospital with her husband, who needed treatment for kidney stones. Seeing the facilities available at the hospital, she mentioned her own problem and asked if there was any solution. After conducting the necessary medical examinations, we asked her why she hadn't sought treatment earlier. She explained that several doctors told they couldn't do anything due to the size of the fistula.

For such issues, traditional surgery can lead to recurrence again. However, with the advanced robotic technology available at AINU, we were able to completely close the fistula without leaving any small openings, thanks to precise, minimally invasive cuts. The procedure involved extremely delicate tissues that needed to be stitched with the utmost accuracy. Using the robotic surgical system, we meticulously and precisely closed the entire fistula, ensuring no errors and maintaining the highest level of care and commitment throughout the surgery

"Bladder perforations of this nature are extremely rare nowadays. In most cases, they occur on a very small scale, just a few millimeters, and patients usually seek medical attention within a few weeks. However, for a patient who has been suffering from such a large urinary leak hole in urinary bladder for 35 years, having access to advanced robotic surgery capabilities is crucial. It allows us to fully restore their quality of life," explained Dr. Ghouse.

"Limitations in the field of medicine are diminishing every day. As a result, addressing such issues or even more severe problems is not a major challenge with modern technology. Dr. Ghouse and team of AINU doctors have set new standards in the treatment of bladder perforations, bringing new hope to the field of urology," explained Dr. Ghouse.

రరోబోటిక్ సర్జరీతో మూత్రాశయ రంధ్రానికి చికిత్స చేసిన ఏఐఎన్యూ వైద్యులు 35 ఏళ్ల క్రితం సాధారణ ప్రసవం కారణంగా రంధ్రం

యూరాలజీ రంగంలోనే సరికొత్త చరిత్ర సృష్టించేలా.. మూత్రాశయానికి పడిన అతిపెద్ద రంధ్రాన్ని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన డా విన్సీ రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మూసేసిన ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు.. రోగికి ఊరట కల్పించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్ తెలిపారు. ఏఐఎన్యూలోని సీనియర్ కన్సల్టెంట్ మహిళా యూరాలజిస్ట్ డాక్టర్ సారికా పాండ్యా కూడా ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్నారు.

అనంతపురం జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహిళ గత 35 ఏళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అప్పట్లో సాధారణ ప్రసవం అయినప్పుడు ఆమె మూత్రాశయానికి పెద్ద రంధ్రం పడింది. అది దాదాపు ఐదారు సెంటీమీటర్ల పొడవు ఉంది. ఈ రంధ్రం కారణంగా ఆమెకు మూత్రం నిలిచేది కాదు. ఎప్పుడూ కారిపోతూనే ఉండేది. డైపర్లు లేదా ఏదైనా బట్ట అడ్డుపెట్టుకుని ఇన్నాళ్లూ ఆమె ఎలాగోలా కాలం గడిపేసేవారు. ఇటీవల ఆమె భర్తకు మూత్రపిండాల్లో రాళ్లు తీయించడానికి ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలను చూసి, తన సమస్య కూడా చెప్పి, దానికి ఏదైనా పరిష్కారం ఉందా అని ఆమె అడిగారు. అప్పుడు తగిన వైద్య పరీక్షలు చేసి చూసి.. ఇన్నాళ్లుగా ఎందుకు చూపించుకోలేదని అడిగాం. దానికి ఆమె.. కొందరు వైద్యుల వద్దకు వెళ్లినా రంధ్రం పెద్దది కావడంతో తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేయడం లాంటి కారణాలు చెప్పారు. దాంతో గత 35 ఏళ్లుగా ఆమె ఇలాగే బాధపడుతున్నారు.

ఇలాంటి సమస్యలకు సాధారణ శస్త్రచికిత్స చేస్తే ఎంతో కొంత చిన్న చిన్న రంధ్రాలు అలాగే వదిలేసే ప్రమాదం ఉంటుంది. కానీ ఏఐఎన్యూలో ఉన్న అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీ సాయంతో మిల్లీమీటర్ల స్థాయి రంధ్రాలను కూడా వదలకుండా మొత్తం రంధ్రాన్ని చిన్న చిన్న కోతలతోనే పూడ్చగలిగాం. ఇందులో అత్యంత సున్నితమైన కణజాలాలు ఉంటాయి. వాటినీ కుట్టాలి. కుట్లు కూడా అత్యంత కచ్చితత్వంతో వేయాలి. రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ ద్వారా దీన్నంతటినీ అత్యంత జాగ్రత్తగా, పూర్తి నిబద్ధతతో, ఏమాత్రం పొరపాట్లకు తావివ్వకుండా పూర్తిచేయగలిగాం.

ఈ అసాధారణ విజయం ఏఐఎన్యూ ఆస్పత్రిలో ఉన్న సరికొత్త ఆవిష్కరణలకు, వైద్యచికిత్సలలో నిరంతర ప్రయత్నాలకు నిదర్శనం. ఈ రోగి కొన్ని దశాబ్దాలుగా పడుతున్న బాధలను కేవలం కొద్ది గంటల్లోనే పూర్తిగా నయం చేయగలిగి, ఆమె జీవితానికి పెద్ద ఊరట కల్పించినందుకు ఎంతో గర్వపడుతున్నాం.

ఇలాంటి మూత్రశయ రంధ్రాలు ప్రస్తుత కాలంలో చాలా అరుదుగా వస్తాయి. ఎవరికైనా కొన్ని మిల్లీమీటర్ల స్థాయిలోనే పడుతుంటాయి. అలాంటి కేసుల్లోనూ వాళ్లు కొద్ది వారాలకే గమనించి వెంటనే వైద్యుల వద్దకు వస్తారు, వాటిని వారు చిన్నపాటి శస్త్రచికిత్సతో నయం చేసేస్తారు.

Gallery

Online Media Coverage Links: