Hyderabad
040-67313131
Secunderabad
040-69097676
Visakhapatnam
0891-6763333
Siliguri
0353-3501000
Chennai
044-69656767
Prostate enlargement is a common issue affecting many. Current treatments often involve medication followed by surgery. However, both approaches have their downsides, including erectile dysfunction and issues with ejaculation, particularly in younger patients. For such individuals, Rezum Water Vapor Therapy has emerged as a promising solution, according to Dr. C. Mallikarjuna, Managing Director and Chief Consultant Urologist at the Asian Institute of Nephrology and Urology (AINU). Speaking on the occasion of the launch of this treatment, Dr. Mallikarjuna highlighted its benefits. Eminent doctors from Asian Institute of Nephrology and Urology Banjara Hills, Dr. Syed Md. Ghouse, Senior Consultant Urologist and Dr. Vijay Kumar Sarma Madduri, Consultant Urologist, were also part of the launch.
“Medications can delay the need for surgery, but over time, the results diminish, and outcomes in patients who delayed the surgery not great. Additionally, both medications and surgeries can cause sexual health issues like erectile dysfunction and ejaculation problems, which can be distressing, especially for sexually active and younger individuals. Rezum Water Vapor Therapy is a breakthrough in addressing these concerns. It offers noticeable results within 15 days to a month.
The treatment uses steam, delivered via injection, to target and shrink the excess prostate tissue compressing the urinary tract. This minimally invasive procedure can be performed under local anesthesia. The natural energy of the steam gradually removes the extra tissue, with results visible over a short period. Typically, one and rarely a second session are sufficient.
The key advantage of Rezum Water Vapor Therapy is that it does not cause erectile dysfunction or ejaculation problems. Only 10 percent of patients who are treated with Rezum may find the need for traditional surgery by 10–15 years.
Patients with heart conditions or those on blood-thinning medications often face challenges with prostate treatments, as these medications must be stopped for extended periods. However, with Rezum, the interruption is minimal, making it safer for such individuals. Post-treatment, patients may need to take antibiotics, pain relievers, and keep a catheter for about maximum of 10 days .
While Rezum Water Therapy offers significant benefits, it is not a complete solution for all prostate issues. It may not be suitable for cases with very large prostates or with complications of prostate . However, it is highly effective for young to middle-aged patients with moderate prostate issues,” Dr. Mallikarjuna explained.
Speaking about Rezum Water Therapy, Mr. Sandeep Guduru, Chief Executive Officer, Asian institute of Nephrology and Urology said, “At AINU, we have always endeavoured to provide our patients with the best available treatments at the highest standards of care. Adding the Rezum water vapour therapy is the latest step to ensure we offer the widest range of treatments for BPH. The incidence of BPH has been increasing in India, and hence it is important to ensure that we have access to the latest technologies and treatments. This new therapy provides options to patients who previously may have been restricted by comorbidities, and thus we are delighted to be the first in Telangana and AP to be offering it.”
ప్రోస్టేట్ ఎన్‌లార్జ్‌మెంట్ అనేది చాలా ఎక్కువమందిలో ఉండే సమస్య. దీనికి ఇప్పటికే పలు రకాల చికిత్సలు ఉన్నాయి. కొన్నిసార్లు మందులు వాడి, కొన్నాళ్ల తర్వాత శస్త్రచికిత్స చేస్తారు. లేదా గమనించిన వెంటనే కూడా శస్త్రచికిత్స చేస్తారు. అయితే.. ఇలా మందులు వాడినా, శస్త్రచికిత్స చేసినా కూడా చాలామందిలో అంగస్తంభన లేకపోవడం, వీర్యస్ఖలనం సరిగా కాకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా యుక్తవయసులోనే ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు వచ్చినవారికి ఈ రెండు రకాల చికిత్సలలో ఏది చేసినా ఇబ్బందికరమే అవుతుంది. ఈ విషయంలో కొత్తగా వచ్చిన రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీ ఇలాంటి రోగులకు ఒక వరం లాంటిదని నగరంలోని ప్రధాన ఆస్పత్రులలో ఒకటైన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సి.మల్లికార్జున తెలిపారు. ఈ చికిత్సను కొత్తగా ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
“మందులు వాడడం వల్ల ప్రోస్టేట్ సమస్య ఉన్నవారికి కొన్నాళ్ల పాటు శస్త్రచికిత్సను వాయిదా వేయగలం. కానీ, ఆ తర్వాత ఐదేళ్లకో, పదేళ్లకో మళ్లీ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు ఫలితాలు అంత గొప్పగా ఉండట్లేదు. దానికితోడు.. చాలామంది రోగుల్లో మందులు వాడినా, లేదా శస్త్రచికిత్స చేసినా కూడా అంగస్తంభన లేకపోవడం, వీర్యస్ఖలనం సరిగా ఉండకపోవడం లాంటి సమస్యలు ఉంటాయి. లైంగికంగా ఇంకా చురుగ్గా ఉన్న పురుషులకు ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యుక్తవయసువారికి కూడా ప్రోస్టేట్ సమస్యలు వస్తున్నందున ఇది మరింత ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పుడు వాటన్నింటికీ పరిష్కారంగా వచ్చినదే రెజ్యూమ్ వాటర్ థెరపీ. ఇది చేసిన తర్వాత సుమారు 15 రోజుల నుంచి నెల రోజుల్లోపు పూర్తి ఫలితాలు కనిపిస్తాయి.
అందులో భాగంగా నీటి ఆవిరిని ఇంజెక్షన్ రూపంలో ప్రోస్టేట్ రూపంలోకి పంపుతాం. ఇది లోకల్ ఎనస్థీషియాతోనే చేయొచ్చు. ఇలా పంపిన ఆవిరికి సహజంగా ఉండే శక్తి.. మూత్రనాళాన్ని నొక్కుతూ ఉన్న అదనపు ప్రోస్టేట్ కణజాలాన్ని క్రమంగా ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇది చాలా సులభమైన చికిత్స. సాధారణంగా ఒకటి లేదా రెండు సిటింగ్‌లలో అయిపోతుంది. లోకల్ ఎనస్థీషియాతోనే చేయొచ్చు. అయితే దీనివల్ల వెంటనే ఫలితాలు ఆశించకూడదు. సుమారు 15 రోజుల నుంచి నెలలోపు పూర్తి ఫలితం కనిపిస్తుంది. ఇందులో ఉండే ప్రధానమైన సానుకూలత ఏమిటంటే.. ఈ చికిత్స తీసుకోవడం వల్ల అంగస్తంభన సమస్య ఉండదు, వీర్య స్ఖలనం సరిగా లేకపోవడం కూడా ఉండదు. ఈ చికిత్స చేయించుకున్నవారిలో పది శాతం మందికి మాత్రమే తర్వాత శస్త్రచికిత్స అది కూడా 10-15 ఏళ్ల తర్వాత అవసరం కావొచ్చు.
గుండె శస్త్రచికిత్స చేయించుకున్న, లేదా గుండెవ్యాధులు ఉన్న రోగులు రక్తాన్ని పల్చబరిచే మందులు వాడాల్సి ఉంటుంది. అలాంటివారు ప్రోస్టేట్ చికిత్స కారణంగా ఆ మందులు కొంత ఎక్కువ కాలం పాటు ఆపేయాలి. కానీ ఈ రెజ్యూమ్ వాటర్ థెరపీలో ఆ మందులు ఎక్కువ రోజులు ఆపాల్సిన అవసరం ఉండదు. కేవలం కొద్దిరోజులు మాత్రం ఆపితే సరిపోతుంది. చికిత్స చేయించుకున్న తర్వాత వైద్యులు చెప్పేదాన్ని బట్టి కొన్నిరకాల యాంటీబయాటిక్స్, నొప్పినివారణ మందులు వాడాల్సిన అవసరం ఉండొచ్చు. అలాగే కొద్ది రోజుల పాటు అంటే.. సుమారు పది రోజుల వరకు క్యాథెటర్ ఒకటి ఉంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ చికిత్స తీసుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు కాఫీ, చాక్లెట్లు, మద్యం జోలికి వెళ్లకపోవడం మంచిది.
అయితే, దీనికి కొన్ని మినహాయింపులు కూడా లేకపోలేవు. దీన్ని ప్రోస్టేట్ సమస్యకు పూర్తి పరిష్కారంగా మాత్రం భావించకూడదు. తాత్కాలికంగా మాత్రమే ఇది సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే ప్రోస్టేట్ సమస్య బాగా ఎక్కువగా ఉన్నవారికి, లేదా సంక్లిష్ట సమస్యలు ఉన్నవారికి ఇది పనికిరాదు. బాగా పెద్దవయసులో ఉన్న రోగుల మీద కూడా ఇది అంతగా ప్రభావం చూపించకపోవచ్చు. యుక్తవయసులో ఉండి, ప్రోస్టేట్ సమస్య మధ్యరకంగా ఉన్న రోగులకు ఈ చికిత్స బాగా ఉపయోగకరంగా ఉంటుంది” అని డాక్టర్ మల్లికార్జున వివరించారు.
బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ)కు చెందిన ప్రముఖ వైద్యులు సీనియర్ కన్సట్టెంట్ యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ మహ్మద్ గౌస్, కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ విజయ్ కుమార్ శర్మ మద్దూరి తదితరులు కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
రెజ్యూమ్ వాటర్ థెరపీ గురించి ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సందీప్ గూడురు మాట్లాడుతూ, “ఏఐఎన్‌యూలో మేం ఎప్పుడూ మా రోగులకు అత్యున్నత ప్రమాణాలతో, వీలైనంత ఉత్తమ చికిత్సలు అందించడానికే ప్రయత్నిస్తాం. రెజ్యూమ్ వాటర్ వేపర్ థెరపీని మా చికిత్సలలో చేర్చడం అనేది బీపీహెచ్‌కి ఉన్న విస్తృత చికిత్సలలో ఇది అత్యాధునికమైనది. భారతదేశంలో బీపీహెచ క్రమంగా పెరుగుతోంది. అందువల్ల అత్యాధునిక టెక్నాలజీలు, చికిత్సలు ఉండడం చాలా ముఖ్యం. ఈ కొత్త చికిత్స వల్ల ఇతర సమస్యలు ఉన్న రోగులకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దీన్ని తొలిసారిగా అందిస్తున్నందుకు మాకెంతో ఆనందంగా ఉంది” అని చెప్పారు.