Book an Appointment

Hyderabad  
040-67313131

Secunderabad  
040-69097676

Visakhapatnam  
0891-6763333

Siliguri  
0353-3501000

Chennai  
044-69656767

aniversary_logo

AINU Doctors Successfully Remove a Rare Dumbbell-shaped Giant Testis Tumor

Hyderabad, 29th May 2024: Doctors at the Asian Institute of Nephrology and Urology (AINU) in Banjara Hills, Hyderabad, have successfully removed a rare, giant dumbbell-shaped testis tumor from a young man. This complex surgery was particularly challenging as the patient is a kidney transplant recipient on high-dose immunosuppressive medication.

The 39-year-old patient from Kadapa underwent kidney transplant surgery a year ago for end-stage kidney failure and has been on powerful steroids and immunosuppressants ever since. Recently, he noticed swelling in his left testis, which he initially dismissed as a simple hydrocele. However, the swelling rapidly grew, prompting further evaluation at AINU. The doctors discovered a large tumor extending from the left testis into the abdomen, surpassing the belly button. Lab tests revealed abnormally high levels of Beta HCG, a testis tumor marker, elevated to more than 20 times the normal value. Fortunately, a PET scan showed no signs of tumor spread to other parts of the body.

Given the patient’s condition as a kidney transplant recipient on immunosuppressive drugs, conventional treatments like chemotherapy and radiotherapy were not viable options. Surgery became the only feasible solution. After thorough preparation for surgery and anesthesia, the patient underwent a complex procedure under general anesthesia.

Dr. Rajesh Kumar Reddy Adapala, a consultant uro-oncologist, led the challenging surgery with surgical support from Dr. Dinesh. The anesthesia team, led by Dr. Nithyananda and Dr. Shifa, provided exceptional support, ensuring a smooth operation. Dr. Srikanth provided critical peri-operative Nephrology care, which was crucial for the patient’s recovery.

The surgical approach involved making an incision higher than usual, from the left groin extending into the abdomen, to avoid violating the tumor environment and reducing the risk of spreading to lymph nodes. The tumor was meticulously dissected without damaging surrounding organs such as the urinary bladder and major blood vessels and successfully removed. Measuring approximately 40cm, the dumbbell-shaped tumor was extracted with minimal blood loss and an uneventful surgery.

The patient was shifted out of the ICU on the first postoperative day and discharged on the third day. “Testis tumors are common among young men, but it is rare to see such a giant mass growing into the abdomen,” noted Dr. Adapala. The patient had a previous successful kidney transplant at AINU, and now he has undergone another complex yet successful surgery. Dr. Mallikarjuna C, Managing Director, and Dr. PC Reddy, Executive Director, expressed their pride in the team’s exceptional achievement.

About Asian Institute of Nephrology & Urology

Asian Institute of Nephrology & Urology is India’s largest single specialty Urology & Nephrology hospital network. It has seven hospitals across four cities with a leading team of nephrologists and urologists. Recognized for its clinical expertise in the field of Urology and Nephrology, the hospitals offer services such as Uro-Oncology, Reconstructive Urology, Paediatric Urology, Female Urology, Andrology, Kidney Transplants and Dialysis. It is a pioneer of Robotic Urology surgery in India. The hospital has a network of over 500 beds in the country and has treated over lac patients. AINU has accreditation from NABH, DNB (Urology & Nephrology) and FNB (Minimal Invasive Urology).

కిడ్నీ మార్పిడి జ‌రిగిన రోగి వృష‌ణాల్లో అరుదైన క‌ణితి

  • 40 సెంటీమీట‌ర్ల పొడ‌వు, డంబెల్ ఆకారంలో క‌ణితి
  • సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేసి తొల‌గించిన ఏఐఎన్‌యూ వైద్యులు

ఒక యువ‌కుడి వృష‌ణాల్లో అత్యంత అరుదైన‌, పెద్ద డంబెల్ ఆకారంలోని క‌ణితిని హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) వైద్యులు విజ‌య‌వంతంగా తొల‌గించారు. ఇప్ప‌టికే ఈ రోగి కిడ్నీమార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు ఎక్కువ మోతాదులో వాడుతుండ‌టంతో శ‌స్త్రచికిత్స బాగా సంక్లిష్టంగా మారింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని క‌డ‌ప న‌గ‌రానికి చెందిన 39 ఏళ్ల వ‌య‌సున్న వ్య‌క్తికి ఏడాది క్రితం మూత్ర‌పిండాలు పూర్తిగా విఫ‌లం కావ‌డంతో కిడ్నీ మార్పిడి శ‌స్త్రచికిత్స చేశారు. అప్ప‌టినుంచి అత‌డు శ‌క్తిమంత‌మైన స్టెరాయిడ్లు, ఇమ్యునోస‌ప్రెసెంట్లు వాడుతున్నాడు. ఇటీవ‌ల అత‌డికి ఎడ‌మ‌వైపు వృష‌ణం వాపు వ‌చ్చింది. దాన్ని సాధార‌ణ హైడ్రోసిల్ అని పొర‌ప‌డ్డాడు. అయితే వాపు క్ర‌మంగా పెరిగిపోతుండ‌టంతో స్థానిక వైద్యుల సూచన మేర‌కు ఏఐఎన్‌యూలో చూపించుకున్నాడు. అత‌డి ఎడ‌మ వృష‌ణం నుంచి బొడ్డు మీదుగా ఉద‌ర‌భాగం వ‌ర‌కు పెద్ద క‌ణితి ఉన్న‌ట్లు వైద్యులు గుర్తించారు. అత‌డి బీటా హెచ్‌సీజీ స్థాయి అసాధార‌ణంగా పెరిగిపోయింది. ఇది సాధార‌ణ స్థాయి కంటే 20 రెట్లు ఎక్కువ‌గా ఉంది. అదృష్ట‌వ‌శాత్తు ఆ క‌ణితి ల‌క్ష‌ణాలు శ‌రీరంలోని ఇత‌ర భాగ‌గాలు వేటికీ వ్యాపించ‌లేద‌ని పెట్ సీటీ స్కాన్‌లో నిర్ధార‌ణ అయ్యింది.

ఈ రోగి ఇప్ప‌టికే కిడ్నీ మార్పిడి చేయించుకుని, ఇమ్యునోస‌ప్రెసెంట్ మందులు వాడుతుండ‌టంతో కెమోథెర‌పీ, రేడియేష‌న్ లాంటి సంప్ర‌దాయ చికిత్స‌లు ఏవీ ప‌నిచేయ‌వు. శ‌స్త్రచికిత్స మాత్ర‌మే చేయాలి. ముందుగా ఎన‌స్థీషియా, శ‌స్త్రచికిత్స కోసం రోగిని సిద్ధం చేసిన త‌ర్వాత‌.. రోగికి జ‌న‌ర‌ల్ ఎన‌స్థీషియాలో ఒక సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేశారు.

క‌న్స‌ల్టెంట్ యూరో-ఆంకాలజిస్టు డాక్ట‌ర్ రాజేష్ కుమార్ రెడ్డి అడ‌పాల నేతృత్వంలో డాక్ట‌ర్ దినేష్ స‌హ‌కారంతో శ‌స్త్రచికిత్స చేశారు. డాక్ట‌ర్ నిత్యానంద‌, డాక్ట‌ర్ షిఫా నేతృత్వంలో ఎనస్థీషియా బృందం అసాధార‌ణ మ‌ద్ద‌తు ఇ్వ‌వ‌డంతో శ‌స్త్రచికిత్స చాలా సాఫీగా సాగింది. రోగి కోలుకోవ‌డంలో అత్యంత కీల‌క‌మైన ఆప‌రేష‌న్ అనంత‌ర నెఫ్రాల‌జీ సంర‌క్ష‌ణ‌ను డాక్ట‌ర్ శ్రీ‌కాంత్ అందించారు.

శ‌స్త్రచికిత్స‌లో భాగంగా సాధార‌ణం కంటే కాస్త పెద్ద కోత పెట్టారు. ఎడ‌మ‌వైపు తొడ భాగం నుంచి ఉద‌ర భాగానికి ఈ కోత పెట్టారు. త‌ద్వారా లింఫ్‌నోడ్స్ వైపు ముప్పు విస్త‌రించ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. చుట్టుప‌క్క‌ల ఉన్న మూత్ర‌కోశం, ప్ర‌ధాన ర‌క్త‌నాళాల‌కు ఎలాంటి ముప్పు వాటిల్ల‌కుండా అత్యంత జాగ్ర‌త్త‌గా, విజ‌య‌వంతంగా క‌ణితిని తొల‌గించారు. దాదాపు 40 సెంటీమీట‌ర్ల పొడ‌వు, డంబెల్ ఆకారంలో ఉన్న ఈ క‌ణితిని వీలైనంత త‌క్కువ ర‌క్త‌స్రావంతో తొల‌గించ‌డం విశేషం.

రోగిని తొలుత ఐసీయూలోకి త‌ర‌లించి, మూడోరోజు డిశ్చార్జి చేశారు. “వృష‌ణాల్లో క‌ణితులు యువ‌కుల్లో సాధార‌ణ‌మే. కానీ అవి ఇంత పెద్ద ప‌రిమాణంలో పెరిగి ఉద‌ర‌భాగం వ‌ర‌కు వెళ్ల‌డం మాత్రం చాలా అరుదు” అని డాక్ట‌ర్ అడ‌పాల తెలిపారు. ఈ రోగికి గ‌తంలో కిడ్నీ మార్పిడి కూడా విజ‌య‌వంతంగా ఏఐఎన్‌యూలోనే జ‌రిగింది. ఇప్పుడు మ‌రో సంక్లిష్ట శ‌స్త్రచికిత్స సైతం ఇక్క‌డే పూర్త‌యింది. త‌మ బృందం సాధించిన ఈ అసాధార‌ణ విజ‌యం ప‌ట్ల ఆస్ప‌త్రి మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సి. మ‌ల్లికార్జున‌, ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ పీసీ రెడ్డి సంతోషం వ్య‌క్తం చేశారు.

Gallery

Online Media Coverage Links: